Home  »  TV News  »  Karthika Deepam2 : సుమిత్రపై మాలిని కామెంట్స్‌కు దీప గట్టి కౌంటర్!

Updated : Jul 30, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -735 లో.... మాలిని దక్షిణామూర్తి ఇద్దరు శివన్నారాయణ ఇంటికి వస్తారు. సుమిత్ర గురించి మాట్లాడుతుంటే తన గురించి మాట్లాడే అర్హత నీకు లేదని దీప అనగానే నీకుందా అని మాలిని అంటుంది. ఉంది ఎందుకు అంటే తను మా అమ్మ అని దీప అనగానే అందరు షాక్ అవుతారు. నేను అమ్మలాగా అనుకుంటా అందుకే ఎవరు ఏం అన్నా నేను ఊరుకోనని దీప అంటుంది. ఆ తర్వాత అసలు తప్పంతా శివన్నారాయణ చేసాడు. అందరు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్లని చేసుకుంటే అది న్యాయం కానీ జ్యోత్స్న విషయంలో అది జరగలేదని దక్షిణామూర్తి అంటాడు.

వాళ్ళ విషయంలో మీరు కలుగజేసుకోవడం తప్పు అని సూరజ్ అనగానే నువ్వు ఎవరు మా మధ్య మేం బంధువులని ఎప్పటికైనా ఒకటి అవుతాం.. నువ్వు పరాయి వాడివే కదా అని మాలిని అంటుంది. అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయని శివన్నారాయణ అంటాడు. నాకు తెలుసు మాలిని గారి ఉంగరం పారిజాతం గారి వేలుకి ఉన్నప్పుడే నాకు అర్థం అయింది అనగానే అందరు షాక్ అవుతారు. దాంతో పారిజాతం భయపడుతుంది. ఇంతకి జ్యోత్స్నకి పెళ్లి ఎప్పుడు చేస్తారని దక్షిణామూర్తి అడుగగా మొదట శుభలేక నీకే ఇస్తామని దీప అంటుంది. తాతయ్య గారు నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా అని దీప అనగానే ఏం తప్పు మాట్లాడలేదు వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా మొదటి శుభలేకతో మీ ఇంటికి వస్తామని శివన్నారాయణ అంటాడు. నాకు పారిజాతం అన్ని చెప్పిందని తననేం అనకండి అని మాలిని అంటుంది 

నాకు ఏం చెయ్యాలో తెలుసు మీరు వెళ్లిపోండి అని శివన్నారాయణ అంటాడు. పారిజాతం వెళ్లి గదిలో దాక్కుంటుంది. అందరు వెళ్ళగానే డోర్ తీసి నాకు మాలిని ఫోన్ చేసి జ్యోత్స్నని తీసుకొని రమ్మంది. ఇప్పుడు నేను జ్యోత్స్నని తీసుకొని వెళ్లకుంటే తనే డైరెక్ట్ గా జ్యోత్స్న దగ్గరికి వెళ్తుందని తీసుకొని వెళ్ళాను.. జ్యోత్స్న తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చింది.. మాలిని ఇచ్చిన రింగ్ తీసుకున్నాను.. ఎందుకంటే అది నేను తీసుకొకపోతే వేరే వాళ్ళకి రింగ్ ఆఫర్ చేసి మన విషయాలు రాబట్టుకునేది అని పారిజాతం కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.